Friday, 28 October 2016

రైతుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ వినతి

రైతుల సమస్యలు  పరిష్కరించాలని  తహసీల్దార్ వినతి

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుకుంటున్న సమస్యలు పరిష్కరించాలని బి జె పి  పార్టీ ఆద్వర్యం లో రెబ్బెన   తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,అనంతరం  తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి బోనగిరి సతీష్ బాబు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు చాల నష్ట పోయారని,పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక[పోవడం ద్వారా  రైతులుచాల తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లో వున్నారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి  నకిలీ విత్తనాలు సప్లై చేసిన దళారుల ఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఒకే దఫా రైతుల రుణ మాఫీ చేయాలనీ ,దళిత రైతులకు మూడెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసారు,అర్హులైన పేద వారికి డబల్ బెదురూమ్ ఇల్లు వెంటనే కట్టించి ఇవ్వాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పసల్ భీమా రైతులకు ఉపయోగ పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.కేంద్రం విడుదల చేసిన  700 కోట్ల రూపాయలను రైతులస్ కోసం విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో మండల ప్రెసిడెంట్ కే బాలకృష్ణ ఎంపీటీసీ మద్దెల సురేందర్ రాజు ,చెర్ల మురళి,మండల మధుకర్  గుల్భము చక్రఫణి, మహిళా నాయకురాళ్లు కృష్ణ కుమారి, నమిత డాలిపాల్గొన్నరు.

No comments:

Post a Comment