దీపావళి బోనస్ ఘనత ఏ ఐ టి యు సి దే -తిరుపతి
దీపావళి బోనస్ ఘనత ఏ ఐ టి యు సి దే -తిరుపతి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి)సింగరేణి కార్మికుకులకు దీపావళి బోనస్ 54000/-రూపాయలు సింగరేణి యాజమాన్యం ఇవ్వడం ఇది కార్మికుల విజయమని , ఏ ఐ టి యు సి పోరాట ఫలితమే నిదర్శనమని ఏ ఐ టి యు సి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు . బుధ వారం అయన మాట్లాడుతూ గత సంవత్సరం 48000 రూపాయలు యాజమాన్యం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు . ఏ ఐ టి యు సి కార్మిక సంగము ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతూ హక్కుల ను కాపాడుతూ వస్తుందని అన్నారు . జె బి బి సి సమావేశములో ఏ ఐ టి యు సి ప్రధాన కార్య దర్శి వాసి రెడ్డి సీతా రామయ్య పాల్గొన్నారని తెలిపారు . కార్మికులు ఐఖ్యత గ ఉంటె ఏదైనా సాదించ వచ్చ్చని పేర్కొన్నారు . కార్మికుల హక్కులను కాపాడటంలో గుర్తింపు సంగం టి బి జి కె ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు . ఈ కార్య క్రమములో ఏ ఐ టి యు సి బ్రాంచ్ ఉపాధ్యాక్షుడు బయ్యా మొగిలి నాయకులు సంపత్ రావు తో పాటు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment