Monday, 17 October 2016

కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని ఇస్తున్న నాయకులు

కేంద్ర మంత్రికి    వినతి పత్రాన్ని ఇస్తున్న నాయకులు

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  బెల్లం పెళ్లికి వఛ్చిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సీ పీ ఐ ,  ఏ ఐ టి యు సి కాంట్రాక్ట్ కార్మిక సంగం బెల్లంపెల్లి ఏరియా నుండి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు . ఈ సందర్బంగా ఏరియా కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న సమస్యలను వివరించారు .సి పి  ఐ మాజీ ఈము ఎల్ ఏ , రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్ మాట్లాడుతూ  రాష్ట్ర  ప్రభుత్వామ్ కాంట్రాక్ట్ కార్మికుల పై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నదని , సింగరేణి కార్మికులతో సమానంగా పని చేస్తూ , తక్కువ జీతాలు తీసుకొంతున్నామని అన్నారు . సింగరేణి సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని , సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ కార్మికులతో ఊడిగం చేయించు కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు . హాస్పిటల్ పుస్తాకాలు ఇవ్వలేదని , సి ఎం పి  ఎఫ్ వివరాలు తెలుపడం లేదని పేర్కొన్నారు . కాంట్రాక్ట్  కార్మికులను వెంటనే పామినెంట్ చేయాలని అన్నారు .  ఈ కార్య క్రమములో   ఏ ఐ టి యు సికాంట్రాక్ట్ బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు బోగే ఉపేందర్ లతో పాటు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment