Sunday, 23 October 2016

అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మండల నూతన కమిటీ ఎన్నిక

 అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మండల నూతన కమిటీ ఎన్నిక 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): అఖిల భారత విద్యార్ధి సమాఖ్య రెబ్బెన మండల నూతన కమిటీని గోలేటిలోని కే ఎల్  మహేంద్ర భవనంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్ అద్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది.అనంతరం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రము లో దేశంలో విద్యారంగంలో అనేకసమస్యలతో విద్యార్థులు  సతమతమవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు . విద్యారంగానికి ఇచ్చిన హామీలు KG  TO PG  కళాశాలల్లో మధ్యాహ్న భోజనం డిగ్రీ కళాశాలలకు పాలిటెక్నిక్ కళాశాలలకు   ఏర్పాటు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఎప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు . విద్యారంగ సమస్యలపై నూతనంగా ఏర్పడిన మండల సమితి ఆందోళనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీ మండల అధ్యక్షులుగా మలిశెట్టి మహిపాల్ ,ఉపాధ్యక్షులుగా సందీప్ ,తిరుపతి, హరీష్, మహీందర్, కార్యదర్శిగా ప్రదీప్, సహాయ కార్యాధ్యక్షులుగా గౌతమ్, సంతోష్, హరీష్, సాయి కోశాధికారిగా వెంకటేష్ లు ఉన్నారు. ఏ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి , డివిజన్ కార్యదర్శి పుదారి సాయి పాల్గొన్నారు. 

No comments:

Post a Comment