Tuesday, 4 October 2016

అక్రమంగా రవాణా అవుతున్న టేకు కలప పట్టివేత

అక్రమంగా రవాణా అవుతున్న టేకు కలప పట్టివేత 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  అక్రముగా తరలిస్తున్న టేకు కలపను రెబ్బెన మండలంలో  సోమవారం రాత్రి  గోలేటి నుంచి మంచిరియాల్ వైపు  వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఏ పి 15 యూ 5410 నెంబర్  గల  వాహనంలో 50 దుంగల కలపను స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.   వీటి విలువ ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నాలుగు రూపాయలు ఉంటుంది అని అన్నారు. వారికీ వచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి పట్టుకున్నామన్నారు. అక్రమమముగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని,అక్రమ రవాణా పూర్తిగా అరికాడుదామని అన్నారు  వీరితో పాటు బీట్ అధికారి ఎమ్ డి షరీఫ్ మరియు ప్రైవేట్ సిబ్బంది వున్నారు.  

No comments:

Post a Comment