Tuesday, 25 October 2016

విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు---- ఎ బి వి పి ప్రధాన కార్యదర్శి

విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు---- ఎ  బి వి పి ప్రధాన కార్యదర్శి 


కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  విద్యార్థుల చదువుకు దూరం చేస్తే ఉద్యమం తప్పదు అని అఖిల  భారతీయ విద్యార్థి పరిషత్   ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ మంగళవారం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కొమురం భీం జిల్లా పాలనా అధికారి చంపాలాల్ కి వినతి పత్రం అందచేశారు ఈ సందర్భముగా మాట్లాడుతూ విద్యార్థులకు విడుదల చేయాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ కు నిధులు కేటాయించకుండ పేద మధ్య తరగతుల విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ వారి జీవితాలతో ప్రభుత్వం ఆదుకోక పోవడం సమంజసం కాదని అన్నారు .  విద్యార్థుల కు స్కాలర్ షిప్స్,మరియు రియంబర్స్ మెంట్ ప్రభుత్వం త్వరగా విడుదల చేయక పోతే కె సి ఆర్ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సుచిత్,  మహేందర్,కార్యదర్శి దేవేందర్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment