Sunday, 23 October 2016

రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించాలి ; జె.సి అశోక్ కుమార్

రైతులకు అందుబాటులో ఉంటూ  సకాలంలో సేవలు అందించాలి ;  జె.సి  అశోక్ కుమార్



కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  అధికారులు అందుబాటులో వుంటూ  సకాలంలో రైతులకు సేవలు అందించాలని జె.సి  అశోక్ కుమార్  అన్నారు ఆదివారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి కార్యాలయ సిబ్బందిని పరిసరాల యొక్క రైతుల పంటల వివరాలు తెలుసుకున్నారు . అలాగే పరిసర ప్రాంతాలలోని ప్రోజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు . మిషన్ కాకతీయ  చెరువుల  వివరాలు ఆరాతీసారు . కుమ్రo భీం   జిల్లా నూతనంగా  ఏర్పడిన తరువాత  మొదటి సరిగా ఉప పాలనాధికారి రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం  విచ్చేసినందుకు పూల గుచ్చాలతో స్వాగతం పలికారు  . ఈ సందర్బంగా రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్ , డిప్యూటీ తహసీల్దార్  రామ్ మోహన్ రావు , జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ  మరియు కార్యాలయ సిబ్బంది బాపన్న,ఉమ్ లాల్ తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment