Saturday, 15 October 2016

ఉద్యోగాల పునరుద్ధరణ కె సి ఆర్ ఘనతే- వెకట్ర్రావు


ఉద్యోగాల పునరుద్ధరణ    కె సి ఆర్  ఘనతే- వెకట్ర్రావు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణి ఉద్యోగులకు వారసత్వ పునరుద్ధరణ కేవలం ముఖ్యమంత్రి కె సి ఆర్ ఘనతయేనని , సింగరేణిలో గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని టి బి జి కె ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రావు అన్నారు . గోలేటి లోని తెలంగాణ భవన్  లో ఏర్పాటు చేసిన సభ లో ఆయన మాట్లాడారు .  ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ మాట్లాడుతూ సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ చేయడం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ఘనతే అని అన్నారు. సకల జనుల సమ్మెలో కార్మికులు  అందరు ఏకమయి టి ఆర్ ఎస్ పార్టీకి అండగా ఉందన్నారు కార్మికులు తెలంగాణ రాష్ట్రము కోసం ఎంతో బలాన్ని ఇచ్చారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య , ఆసిఫాబాద్ మార్కెట్  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,  టి బి జి కె ఎస్ నాయకులు మిర్యాల రాజి రెడ్డి ,బాపురావ్ ,టి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment