మత్స్యుకారులకు కు న్యాయం చేయాలి
మత్స్యుకారులకు కు న్యాయం చేయాలి

కొమురం బీమ్ రెబ్బెన (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల మత్సుకారులు గురువారం తమకు చేయాలనీ తహసీల్ధార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నంబాల ఎంపీటీసీ సభ్యుడు కొవ్వూరి శ్రీనివాస్ మరియు మత్స్యుకార సంఘం అధ్యక్షులు బక్క సత్య నారాయణ, ఉపాధ్యక్షులు బక్క భానుప్రసాద్ లు మాట్లాడుతూ రెబ్బెన మండలం లోని నిరు పేద మత్స్యుకారులు గత యాభై సంవత్సరాలు గ చేపలు పట్టడమే వారి జీవనాదారం చేసుకొని జీవిస్తున్నారని,వీరు ఒక్క సెంటు భూమి లేని పేదవారిని ,మండలం లోని చెరువులలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది అగస్ట్ నెలలో రెబ్బెన లోని ఎల్లమ్మ చెరువులో లక్ష రూపాయల విలువ గల సుమారు గ లక్ష ఇరవై వేల చేప పిల్లలని వేసినారని అయితే ఒక్కరిద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి సొసైటీ లేకుండా అనుమతి లేకుండా చేపలు పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అదే విధంగా మత్స్యుకారులకు, సొసైటీ కి తెలియ పరచకుండా నేడు అధికారులను తప్పు తోవ పట్టించి, నూతన జిల్లా అధికారుల అవగాహన లోపం తో, మరల అదే ఎల్లమ్మ చెరువులో ప్రభుత్వం ఇచ్చినటువంటి చేప పిల్లలని వేసినారు. అయ్యా...... ప్రత్యేక రాష్ట్రం వచ్చి మా బ్రతుకులు మారాలని మత్స్యుకారులందరం తట్ట బుట్ట వలలతో రోడ్డు ఫై ఉద్యమం చేసామని కానీ స్వరాష్ట్రంలో మా నోట్లో మట్టి కొట్టడం ఏంత వరకు సమంజసం ,ఈ రోజు ఏ ఒక్క మత్స్యుకారుడు లేకుండా అధికారులు,కొందరు ప్రజాప్రతినిధులు చెరువులో చేప పిల్లలని వేయడం ఎంత వరకు సమంజసం,వెంటనే ఇట్టి విషయం అయ్యి తగు చర్యలు తీసుకొని యడల ఉద్యమం చేస్తామని మత్స్యుకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని,సంభందిత అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.ఇట్టి విషయం ఫై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ దీనిని వెంటనే సబ్-కలెక్టర్ గారి ద్రుష్టి కి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కుల పెద్దలు బక్క నాగయ్య లక్ష్మేన్,బిమయ్య ,పోచం, రమేష్ , శంకర్, మల్లేష్ ,సాగర్,వెంకటేష్ ,పోషయ్య ,రాజ్ కుమార్,పాల్గొన్నారు.
No comments:
Post a Comment