కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): నేటి విద్యార్థులు ప్రగతికి మెట్లు అని పట్టుదలతో చదివితే సాదించ లేనిది ఏది లేదని డి ఐ ఈ ఓ నాగేందర్ అన్నారు. శుక్రవారం రోజున రెబ్బెన ప్రభుత్వ కళాశాలలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం సమావేశంలో కాలేజీకి ముఖ్య అతిధిగా జెడ్ పి ఎచ్ ఎస్ ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు కళాశాలకు విచ్చేసిన డి ఐ ఈ ఓ నాగేందర్ విద్యార్థులను ఉద్దేశించి భావితరాల భవిష్యత్తును గుర్తు చేసి పై చదువులపై అవగాహన కల్పించారు అదేవిధముగా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి,క్రమశిక్షణ తో చదివితే మంచి భవిష్యత్ ఉంటుంది అని తెలిపారు విద్యార్థు లు అట, పాటలతో నృత్యాలు చేసి ప్రత్యేకంగా ఆకర్షితులు అయ్యారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు శాంతి ,అతియా ,వనమాల ,ప్రకాష్ ,శ్రీనివాస్,గంగాధర్ ,అమరేందర్, విద్యార్థులు మరియు తదితరులు `పాల్గొన్నారు.
No comments:
Post a Comment