పరిపాలన సౌలభ్యం కొరకే చిన్న జిల్లాలు -జోగు రామన్న
కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)
కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రజల సౌకర్యార్థo , పరిపాలన సౌలభ్యం కొరకే ముఖ్యమంత్రి కె సి ఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు . దసరా పండగ రోజు ఆసిఫాబాద్ ను కొమురం భీం జిల్లాగా నామకరణం చేస్తూ జిల్లాను ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల సందర్బంగా కె సి ఆర్ ఇఛ్చిన మాట ప్రకారం ఆసిఫాబాద్ ను కొమురం భీం జిల్లాగా ఏర్పాటు చేయడం ఆయన నిజాయతీకి నిదర్శనం అన్నారు . పేద , బడుగు వర్గాల అభివృద్ధి కోసం ఆహార్నిశలు శ్రమిస్తూ , అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు . షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి , పేదలకు 3 ఎకరాల భూమి , మిషన్ కాకతీయ , భగీరథ పథకం తదితర సంక్షేమ పథకాలను అమలు పరిచారని అన్నారు . చిన్న జిల్లాలు త్వరిత గతిన అభివృద్ధి చెందుతాయాని , దీనితో రాష్ట్రాన్నే బంగారు తెలంగాణ గా మార్చేయాలనే ఆలోచనతో ముఖమంత్రి ముందుకు వెళ్తున్నారని , రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల బాగస్వామ్యం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ లు కోవా లక్ష్మి , కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్ , వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లతో పాటు అధికారులు , నాయకులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment