తెలంగాణ ప్రభుత్వం రైతులపై చిన్న చూపు - టి.వి.వి.జనరల్ సెక్రటరీ (ఈ.చంద్రశేఖర్)
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం రైతులపై చిన్న చూపు చూస్తూ రుణమాఫీని ఒకేసారి అమలు చేయకుండా రైతు ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారని తెలంగాణ విద్యార్థి వేదిక జనరల్ సెక్రటరీ ఈ. చంద్రశేఖర్ అన్నారు శనివారం రెబ్బన అతిధి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశం లో కరపత్రాలను విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ భూమి,నీరు,విత్తనాలపై రైతుల హక్కుల సాధనని దూరం చేస్తున్నారని, బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా రుణమాఫీ మొత్తని ప్రభుత్వం ఒకేసారి చెల్లించాలని, వస్తావసాగుదారులందరికి పంట రుణాలని ఇవ్వాలని రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష వైఖరికి నిరసనగా సమగ్ర వ్యవసాయ విధానం కోసం ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టి.వి.వి ప్రెసిడెంట్ యం.దేవేందర్ , టి.వి.వి వైస్ ప్రెసిడెంట్ ఎల్.రమేష్ , రైతులు దుర్గంసోమయ్య , ఆర్.నర్సయ్య ,బానోతు.కిషన్,లక్ష్మి నారాయణ గౌడ్,కిషన్ గౌడ్,హరిలాల్ నాయక్ అజ్మీరా,ప్రేమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment