Tuesday, 4 October 2016

గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి- విజయకుమారి

 గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి-  విజయకుమారి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);గాంధీజీ  అడుగు జాడల్లో నడవాలని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెట్ ఢీకొండ విజయ కుమారి అన్నారు . ఆదివారం ఎస్ వి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో గాంధీజీ జయంతి ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా గాంధీ  పటానికి పూలమాలలు వేసారూ . అహింస మార్గమే దేశానికి రక్షా అని ఆమె అన్నారు . ఈ నాటి యువత క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని , అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు . అదే విదంగా స్థానిక తహశీల్ధార్ , ఎం ఫై డి ఓ,  గ్రామ పంచాయతీ  కార్యాలయముల లో గాంధీ పటానికి పూల  మాలలు  వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఏ  కార్య  క్రమములో తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ , సత్యనారాయణ సింగ్ , స్థానిక సర్పంచ్ పెసర వెంకటమ్మ , ఉప సర్పంచ్ శ్రీధర్ , సాయి విద్యాలయం ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవకుమార్ , ఫీల్డ్ అసిస్టెంట్ తుకారాం , తల్లి తండ్రులు విద్యార్థులు ఉన్నారు.

No comments:

Post a Comment