కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Tuesday, 4 October 2016
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి ఎమ్ ఎల్ ఏ కు సన్మానం
ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి ఎమ్ ఎల్ ఏ కు సన్మానం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేసినందుకు ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ,ఎం ఎల్ ఏ కోవ లక్ష్మికి సన్మానం చేసి ధన్యవాదాలు తెలియచేస్తూ చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.అసిఫాబాద్ జిల్లా ప్రకటించిన సందర్భంగా మిఠాయిలు పంచుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు పండుగ వాతావరణం చోటుచేసుకొంది నాయకులందరూ కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకొన్నారు అదే విధముగా ఎం పి డి ఓ కార్యాలయంలో పలువురు నాయకులూ ఏర్పాటు చేసిన సమావేసంలో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కావడానికి వీరు ఎంతగానో కృషి చేసారు అని అన్నారు. ఈ కార్య క్రమములో ఎం పి పి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు , వైస్ ఎం పి పి రేణుక , సర్పంచ్ పేసరి వెంకటమ్మ , ఉప సర్పంచ్ శ్రీధర్ , ఆసిఫాబాద్ మార్కెట్ చైర్ మెన్ శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ , నాయకు లు , చిరంజీవి గౌడ్ , నవీన్ జైస్వాల్ , శ్రీనివాస్ గౌడ్ ,మదునయ్య ,సోమా శేఖర్ ,సుదర్శన్ గౌడ్ , జాకిర్ ఉస్మాని,వెంకటేశ్వర గౌడ్ , సోమయ్య , రాపర్తి ఆశోక్ , రాజ్ కుమార్ , వెంకట రమణ లు ఉన్నారు .
No comments:
Post a Comment