Monday, 17 October 2016

జోడేఘాట్ ను జిల్లా పర్యాటక క్షేత్రముగా రూపు దిద్దుతం


జోడేఘాట్ ను జిల్లా  పర్యాటక క్షేత్రముగా రూపు దిద్దుతం




కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): జోడేఘాట్ ను జిల్లా  పర్యాటక క్షేత్రముగా అభివృద్ధి చేస్తామని మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి లు   అన్నారు.  కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ కొమురం భీం 76 వ వర్థంతి ని ఆదివారం ఘనముగా నిర్వహించారు.  ఈ సందర్భముగా జోడేఘాట్ లో రూ  25 కోట్లతో నిర్మించిన ట్రైబల్ మ్యూజియం ని మంత్రులుఆదిలాబాద్ ఎం పి గోడం నగేష్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కొవ లక్ష్మి సిర్పూర్ ఎం ఎల్ ఏ కోనేరు కోనప్ప తో కల్సి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం నిజాం నవాబు గుండెల్లో వణుకు పుట్టించిన పోరాట యోధుడు కొమురం భీం అని , ఆ యోధుడి 76 వ వర్ధంతిని అధికారికంగా ఎంతో ఘనంగా నిర్వహించామని  అన్నారు.   ఈ మహావీరుడి ది తెలంగాణ కావడం, ప్రతి తెలంగాణీయుడు గర్వించే విషయం అని కొనియాడారు . అనంతరం జిల్లా అదికారులు ఏర్పాటు చెసిన స్టాల్ లను పరిశీలంచారు .ఈ కార్యక్రమం లో ఏర్పాటు చెసిన దర్బారులో పాలుగోని భీం గురించి గెరిల్లా పోరాటం మరియు జల్ జంగల్ జమీన్ గురించి పోరాడి అశువులు బాసిన మహానీయుడు అన్నారు  తెలంగాణ లోని కొత్త 31వ జిల్లా గా ఏర్పడిన కుంరం భీం, అసిఫాబాద్ నియోజకవర్గం లోని భీం పురిటి గడ్డ జోడేఘాట్ కావడం తో కె సి ఆర్  అసిఫాబాద్ ను జిల్లా గా ఏర్పాటు చేశారు .స్వంత జిల్లాలో కుంరం భీం 76వ వర్దన్తి ఐ టి డి ఏ  అదికారులు ఏర్పాట్లు చేశారు .ఈ గిరిజన దర్బారు కు అద్యక్షులు గా అసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి వహించారు .భీం వర్దన్తి లో బాగంగా గిరిజన మ్యూజియం ,భీం 8 అడుగుల  కాంస్య విగ్రహం ను ఆవిష్కరించారు .పర్యాటక శాక ఛైర్మన్ పి రాములు ,మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రం సక్కు ,మాజీజెడ్ పి  ఛైర్మన్ సీడం .గణపతి ,జిల్లాలోని అదికారులు కలెక్టర్ చంపాలాల్ జె సి అశోక్ కుమార్ ,డి ఆర్ ఓ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటకశాక కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment