Tuesday, 18 October 2016

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి;-ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి;
ఏ ఐ ఎస్ ఎఫ్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కుంమ్రం భీం జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎ ఐ ఏస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్  పరిష్కరించాలని మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ చాంపాన్ లాల్ కు జిల్లా సమితి పక్షాన వినత పత్రం అందజేశారు . అనంతరం రవీందర్ మాట్లాడుతూ  ఎస్ కె ఈ  డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని అలాగే ఖాళీగా ఉన్న అధ్యపక పోస్టులను భర్తీ చేయాలని,జిల్లాలో డిగ్రీ,పాలిటెక్నిక్,ఐ టి ఐ  కళాశాలలను మంజూరు చేయాలని,రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్వంత భవనంలోకి తరలించాలని,పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ,రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో మూసివేసిన సంక్షేమ వసతి గృహలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సమితి ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు ఆత్మకురి ప్రశాంత్,డివిజన్ అధ్యక్షుడు బవునే వికాస్,కార్యదర్శి పూదరి సాయి,నాయకులు ప్రదీప్,మహేష్,సందీప్,సాయి,భీమ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment