Friday, 7 October 2016

కిష్టాపూర్ ను రెబ్బెన లోనే కొనసాగించాలి

కిష్టాపూర్ ను రెబ్బెన లోనే కొనసాగించాలి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కిష్టాపూర్ గ్రామ పంచాయతీ ని రెబ్బెన మండలంలోనే కొనసాగించాలని సర్పంచ్ భీమేష్ తో పాటు ప్రజలు  రెబ్బెన తహశీల్ధార్  గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు . సర్పంచ్ భీమేష్ మాట్లాడుతూ రెబ్బెన రావడానికిప్రజలకు ఎంతో  సౌకర్యంగా  ఉంటుందని , అదేవిదంగా రైలు ప్రయాణానికి , బస్సు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు . ప్రజలందరికి అనుకూలమైన రెబ్బెన లోనే కిష్టాపూర్ ను ఉంచాలని తెలిపారు . ఈ కార్య క్రమములో నాగయ్య , శంకర్ , యాదగిరి , విలాస్ , పోచయ్య , ,గుండయ్య  అంజాన్న , సంతోష్ లు ఉన్నారు.

No comments:

Post a Comment