ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించడం సంతోషం- తెలంగాణ విద్యార్థి వేదిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనముగా ఆసిఫాబాద్ కేంద్రముగా జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం అని తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా అధ్యక్షుడు కడ్తల సాయి అన్నారు రెబ్బెన అతిధి గృహంలో మంగళ వారం రోజున ఏర్పాటు చేసినా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కోసం ఏకైక విద్యార్థి సంఘము టి వి వి ముందు ఉండి పోరాడింది అని అన్నారు జిల్లా కేంద్రముగా ఆసిఫాబాద్ కావడం వల్ల చుట్టూ ప్రక్కల వున్నా గిరిజన గుడాలు అభివృద్ధి చెందుతూ పరిపాలన వ్యవస్థ మెరుగు పడుతుంది అని అన్నారు అలాగే ఆసిఫాబాద్ జిల్లా కోసం తోడ్పడిన నాయకులందరికీ ఉద్యమాభివందనాలు తెలియచేశారు ఈ సమావేశంలో ప్రదీప్ ,కార్తీక్, ప్రకాష్ ప్రణయ్, దుర్గం కుమార్ ,సంజీవ్, శ్రీనివాస్ తదితరులు వున్నారు
No comments:
Post a Comment