Sunday, 9 October 2016

చేగువేరా 49 వ వర్ధంతి

చేగువేరా 49 వ వర్ధంతి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఒక దేశ భూభాగం ప్తె మరోదేశం చేసే పెత్తనం సరైనది కాదని సూటిగా ధాటిగా వ్యతిరేకిస్తూ  సామ్రాజ్యవాద ప్రమాదాలను సాయుధం గా ప్రతిఘటించిన సాహసవీరుడు పీడీత దేశాలకు ప్రియమైన మిత్రుడు  బడుగు జీవుల బంధువు చే గువేరా అని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ AIYF జిల్లా నాయకుడు బోగే ఉపేందర్ అన్నారు.. దేశ భక్తి అంటే భూమి మిద మాత్రమే కాదని ప్రజాల స్వేచ్చ స్వతంత్రాలు అనే భావన తో క్యూబా అర్జెంటి నా అన్ని దేశాల పేదల కోసం సాయుధ భాట పట్టి న వీరుడు మన చేగువేరా అని అన్నారు చేగువేరా  స్ఫూర్తితో ప్రపంచ దేశాల ప్రజలు సార్వభౌమాధికారము క్తీ అలోచించాలని అయన ఆశయాలను ఆచరించాలని యువత కు పిలుపు నిచ్చారు నేడు దేశం లో మహిళలకు విద్యార్థి నిలకు రక్షణ. కరువ్తెందని అశ్లీల చిత్రాలను వ్యతిరేకించాలని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పంచాలని విద్య ఉపాధి వ్తెద్యం అందరికి అందినపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులు యువకులు చేగువేరా అశయాలతో ముందుకు పోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో AITUC మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య AISF డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్ నాయకులు మహిపాల్ రహీం కమలకర్ అశోక్ సాయి పోషమల్ల చల్లూరి అశోక్ సందీప్ రమేష్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment