సింగరేణి గుర్తింపు సంఘం టి బి జి కె ఎస్ కార్మికులను మోసం చేస్తున్నది
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): సింగరేణి గుర్తింపు కార్మిక సంగం 4 సంవత్సరాల నుండి కార్మికులను మోసం చేస్తున్నాడని గోలేటి బ్రాఞ్చ తిరుపతి అన్నారు . రెబ్బెన మండలం గోలేటి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ ఐ టి యు సి కార్యదర్శి ఎస్ తిరుపతి మాట్లాడుతూ వి ఆర్ ఎస్ ,డిస్మిస్ కార్మికుల ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు వారసత్వంపై ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని,ఆ ప్రకటనలో స్పష్టత లేక పోవడం లో సింగరేణి కార్మికులంతా అయోమయోల్లో వున్నారు అని అయన తెలిపారు ఎ ఐ టి యు సి ఆధ్వర్యంలో వారసత్వ ఉద్యోగాలు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని గనుల వద్ద నిరసన కార్యక్రమాలు జి ఎం కార్యాలయం ముందు ధర్నాలు ,అదేవిధముగా గోలేటి గని నుంచి మణుగూరు వరకు గనులను సందర్శిస్తూ పోరుయాత్ర నిర్వహించామన్నారు పది వేల కార్మికులతో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఎ ఐ టి యు సి ఆధ్వర్యంలో ముట్టడి చేసాము అని అన్నారు ఈ ఆందోళన ఫలితంగానే వారసత్వంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు సింగరేణి గుర్తింపు సంఘం టి బి జి కె ఎస్ కార్మికులను నాలుగేళ్లు మోసం చేస్తూనే వస్తుందని అంతర్గత కుమ్ములాటలతో డబ్బుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి నాయకులు జైలుపాలయ్యర న్నారు గెలవ గానే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపై పెడతామని, పెట్టలేదని ఇది కార్మికులను మోసం చేసినట్టు కదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఆర్గనైజేషన్ కార్యదర్శులు,తిరుపతి, గుండె వెంకటి, నాయకులూ సత్యనారాయణ, సురేష్, శంకర్ తదితరులు వున్నారు .
No comments:
Post a Comment