Saturday, 15 October 2016

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి -డి.విజయ కుమారి

అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి -డి.విజయ కుమారి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని ఎస్ . వి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ దీకొండ  విజయ కుమారి అన్నారు . శనివారం పాఠశాలలో అబ్దుల్ కలాం 85 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా విజయ కుమారి మాట్లాడారు . రాష్ట్ర పతి గా అబ్దుల్ కలాం నిరాడంబ జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు . దేశానికి సైన్సీస్టుగా ఎన్నో సేవలు చేశారని , అతని సేవలు మరువలేనివని కొనియాడారు . పేద కుటుంబములో పుట్టి , శాస్త్రవేత్తగా ఎదిగి , రాష్ట్ర పతిగా దేశానికి ఎనలేని సేవలు చేసి దేశ గౌరవం కాపాడిన మహా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు . విద్యార్థులు అతన్నీ ఆదర్శనంగా తీసుకొని , సమాజములో మంచి గుర్తింపు పొందాలని అన్నారు  . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు జాడి తిరుపతి  , లెక్కల రాజన్న , ఎస్ డి . రేష్మ , మల్లేశ్వరి ,యై .  సుజాత , ఉష , వినీత , విద్యాసాగర్ , ఆశ లతో పాటు విద్యార్థుల తల్లి తండ్రులు , విద్యార్థులు ఉన్నారు .

No comments:

Post a Comment