గీత కార్మికులకు ఈత చెట్లు పెంచడానికి భూమి ఏర్పాటు చేయాలనీ తహసీల్దార్ కి వినతి
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలం లో జి ఓ నెంబర్ 560 ప్రకారం గీత కార్మికులకు ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాల భూమి ఇప్పించగలని రెబ్బెన తహసీల్దార్ కి శుక్రవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు అనంతరం అధ్యక్షుడు తాళ్లపెల్లి కిష్టాగౌడ్ మాట్లాడుతూ రెబ్బెన శివారులో ప్రభుత్వ భూమి లో వున్నా ఈత చెట్లను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించు కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు జి ఓ ప్రకారం రెబ్బెన మండల గౌడ సంఘం పేరున పట్టా పాసు పుస్తకం ఇప్పించగలరని గౌడ సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్వేశ్వర్ గౌడ్ ,నియోజక ఇంచార్జ్ సుదర్శన్ గౌడ్ ,జిల్లా కోశాధికారి కొయ్యడ రాజా గౌడ్ ,యూత్ అధ్యక్షుడు శాంతి గౌడ్ ,మండల నాయకులు చిరంజీవి గౌడ్ ,నర్స గౌడ్ ,ఉమేష్ గౌడ్ మరియు సభ్యులు వున్నారు
No comments:
Post a Comment