Tuesday, 18 October 2016

'రెబ్బన'లో గ్రామసభ

'రెబ్బన'లో గ్రామసభ 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన గ్రామా పంచాయితి లో మంగళవారం నాడు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏ .పి .ఎం వెంకటరమణ ,కార్యదర్శి మురళీధర్,సర్పంచి పెసరు వెంకటమ్మ, ఏ.ఎం.సి వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ఆధ్వర్యం లో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో వారు మాట్లాడుతూ రెండో విడత ఓ.డి.ఎఫ్ ఫథకం కింద అమలు చేసిన మరుగుదొడ్డ్లను    ఇంటింటి నిర్మించాలని   'స్వచ్ భారత్'లోభాగంగా పరిషారాల పరిశుభ్రత  కొరకు ప్రతి  ఇంటికి  మరుగుదొడ్లు లేని వారు ఇంటింటి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అన్నారు. అలానే పారిశుద్యంలో బాగంగా ప్రతి ఒక కాలనీలో మురికి కాలువలు శుబ్రం చేపిస్తున్నాం అన్నారు.గ్రామా పంచాయితి లో పన్నులు వాసులు చేసి,పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని, 100 శాతం పన్నులు వసూలుకు ప్రజలు సహకరించాలని కోరారు.ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ గ్రామంలో శ్వాసకోశ వ్యాధులు ప్రభులుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఈ సమావేశంలో పంచాయితి వార్డ్ మెంబర్లు,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment