రెబ్బెన ఆటో డ్రైవర్ మృతి - అనాథలైన పిల్లలు
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమణయ్య (46 )ఆటో డ్రైవర్ విష జ్వరముతో శనివారం మృతి చెండాడు . మృతుడు రమణయ్య కు గత 2 రోజులుగా విష జ్వరముతో కాగజ్ నగర్ ఆసుపత్రికి , అనంతరం శనివారం కరీంనగర్ కు తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు బంధువులు తెలిపారు . మృతుడి అన్న వదిన మృతి చెందడముతో వారి పిల్లలను , కుటుంబాన్ని పోషించాడు . రమణయ్య మృతి చెందడముతో పిల్లలు అనాథలయ్యారు . మృతుడి కుటుంబాన్ని జెడ్ పి టి సి బాబు రావు తో పాటు ఆటో యూనియన్ నాయకులు పరామర్శించారు . రమణయ్య మృతికి సంతాప ము తెలుపుతూ ఆది వారం నాడు ఆటోలు బంద్ పెడుతున్నట్లు ఆటో నాయకులు తెలిపారు.
No comments:
Post a Comment