Wednesday, 30 September 2015

వైస్ చైర్మన్ కోరుతూ ఎంఎల్ఎ వినతీ పత్రం


ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎంఎల్ఎ కోవ లక్ష్మికు ఆదివారం నాడు త్వరలో నియామకం జరిగే మార్కెట్ కమిటీ పదవులలో వైస్ చైర్మన్ పదవిని రెబ్బెన మండల యూత్ ప్రెసిడెంట్ దాసారపు వెంకట్రాజం కు ఇవ్వాలని తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైశ్వాల్  వినతీ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యాక్రమంలో జమ్మి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్, తదీతరులు పాల్గొన్నారు

ఘనంగా కొండలక్ష్మణ్‌ జయంతి 




రెబ్బెన మండల కేంద్రమైన గోలేటిలో బీసీ హక్కుల సంఘర్షణ సమితీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కొండలక్ష్మణ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ హక్కుల సంఘర్షణ సమితీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం మంత్రి పదవిని వదులుకున్న గొప్ప మహానీయుడు బాపూజియేనన్నారు. కొండలక్ష్మణ్‌ బాపూజీ అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. కూల్చివేసిన ఇంటి వద్దనే ఆయన ఆడిటోరియం ఏర్పాటు చేయాలన్నారు. ఏదో ఒక జిల్లాకు కొండలక్ష్మణ్‌పేరు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోగే ఉపెంధర్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడతల మల్లయ్య, రమేష్, సుధాకర్, ప్రభాకర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment