Wednesday, 23 September 2015

త్రాగు బోరులో కలిషిత నీరు,,విద్యార్థులతో వెట్టి చాకిరి

త్రాగు బోరులో కలిషిత నీరు,,విద్యార్థులతో వెట్టి చాకిరి

పూర్తికాని మరుగు దొడ్లు-- ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి



రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో త్రాగు నీటి బోరుబావిలో నీరు మొత్తం మురికిగా వస్తున్నాయని, విద్యార్థులతో వెట్టి చాకిరి చేస్తునారని ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు, బుధవారం ఆయన స్వయంగా పాటశాలకు వెళ్లి పరిశీలించగా త్రాగు నీటి బోరుబావి పూర్తిగా మట్టితో కలిషితం అయ్యిందని, విద్యార్థులు ఈ నీటిని త్రాగి వ్యాదుల బారిన పడుతున్నారని, మరుగు దొడ్లు పూర్తిగా నిర్మించలేదని అన్నారు. అదేవిధంగా విద్యార్థులను కించపరిచేలా వారితో జాతీయ రహాదారిపై పెట్టెలను మోపిస్తున్నారని తెలిపారు.
ఎచ్ఎం స్వర్ణలత-- బోరుబావిలో నీరు మురికిగా వస్తున్నాయన్న మాట నిజమేనని కాని విద్యార్థులు వాటిని త్రాగడం లేదని, కొత్తగా వచ్చానని విద్యార్థులతో పనులు చేపించడం లేదని పునరావృతం కాకుండా చూస్తానని అన్నారు.

No comments:

Post a Comment