Saturday, 19 September 2015

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి

బాహుబలి వినాయక--నవయుగ గణేష్ మండలి



రెబ్బెనలో నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద బాహుబలి వినాయకున్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలతో దూపదీపలతో పూజలు చేశారు. బొజ్జ గణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించారు.  భక్తి ప్రపత్తులతో గణపయ్యకు ఇష్టమైన వంటకాలను,ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహించారు.  వెరైటి గణనాథులు ప్రజలను కనువిందు చేశాయి. రెబ్బెన గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి వినాయకున్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments:

Post a Comment