కనీస వసతులు కల్పించాలి
గోలేటి బస్టాండ్ ఆవరణలో మరుగు దొడ్లు నిర్మించాలని, గ్రంధాలయంలో కనీస వసతులు కల్పించాలని ఎ,అయ్,వై,ఎఫ్ మరియు ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కు వినతీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోలేటికి రోజు అనేకమంది ప్రజలు వస్తారని, వారిలో వృద్ధులు వికలాంగులు చిన్న పిల్లలు మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, అలాగే కార్మిక పిల్లలు, గ్రామ ప్రజలు చదువుకునే గ్రంధాలయంలో కనీస వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఎ,అయ్,వై,ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్, ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్, ఎ,అయ్,ఎస్,ఎఫ్ మండల అధ్యక్షుడు కస్తూరి రవికుమార్, పూదారి సాయికిరణ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment