Saturday, 19 September 2015

తహశిల్దార్ కు రైతుల వినతీ పత్రం

తహశిల్దార్ కు రైతుల వినతీ పత్రం

రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి నవేగాం శివారులో గల పత్తి పంట బాగా నష్ట పోయిందని శనివారం నాడు రెబ్బెన మండల నవేగాం గ్రామానికి చెందిన రైతులు మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కువినతీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నవేగాంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్నా 50 ఎకరాల పత్తి పంట పూర్తిగా నేలరాలిందని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. లక్ష్మిబాయి, సునీత, విమల, మీరాబాయి, పురుషోత్తం, గ్రామ రైతులు పాల్గొన్నారు

No comments:

Post a Comment