నిమజ్జనం శాంతియుతంగా జరపాలి-ఎస్సై హనూక్
గణేష్ నిమజ్జనం అందరు కలిసి మత సామరస్యంగా శాంతి యుతంగా జరపాలని రెబ్బెన ఎస్సై హనూక్ అన్నారు. శుక్రవారం రెబ్బెన తహశిల్దార్ రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెబ్బెనలో గతంలో ఎలాంటి సంఘటనలు జరగిన దాఖాలు లేవని అదేవిధంగా కులమత భేదం లేకుండా సామరస్యంగా శనివారం రోజు నిమజ్జనం నిర్వహించాలని అన్నారు. మత్తు పానీయాలు సేవించరాదని, క్రమ పద్ధతిలో వెళ్లాలని, ట్రాఫిక్ కు ఎలాంటి అడ్డంకులు కలగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని అన్నారు. అనంతరం నిమజ్జన స్థలాలు పరిశీలించారు. ఈ కార్యాక్రమంలో ఎంపిపి కార్నాధం సంజీవ్, ఎమ్మార్వో రమేష్ గౌడ్, జడ్పిటిసీ అజ్మెర బాబురావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment