పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేస్తున్న యువతుల అరెస్ట్.. అమ్మాయిల టాలెంట్ కు పోలీసుల షాక్

పేస్ బుక్ లో అబ్బాయిలు అమ్మాయిలకు వల వేస్తుండడం ఎన్నో చూసాం.. కాని పోలీసులే నివ్వెరపోయే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు పేస్ బుక్ లో అబ్బాయిలకు వల వేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే ఏకంగా రూ.40 వేల కెమెరా ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఈ యువతుల టాలెంట్ చూసి పోలీసులే నివ్వెర పోయారంట.
ఇద్దరు అమ్మాయిలు కలసి ఫేక్ అకౌంట్ లు రెడీ చేసి అందమైన ఫొటో పెట్టి అబ్బాయిలను బుట్టలోకి దింపుతున్నారు. ఇద్దరు కలసి వందల మంది అబ్బాయిలను మోసం చేశారు. వీరి దెబ్బకు ఎంతోమంది యువకులు వేలకు వేలు సమర్పించుకున్నారు. ఎంతో మంది యువకులను దేవదాసులను చేసారు. చివరికి బాదితులంతా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం తో ఆ యువతుల మోసం వెలుగు చూసింది.
అయితే ఎవరి వద్ద ఎంతెంత తీసుకున్నది ఇంకా తెలియాల్సి ఉందని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే పోలీసు స్టేషన్ వద్దకు 17 మంది యువకులను పోలీసులు పిలిచి విచారించారు.
ఇందులో మరో ట్విస్టు ఏమిటంటే.. ఈ ఇద్దలు కేడి గల్స్ ఇంటి నుండి పారిపోయి, హైదరాబాద్ కి వచ్చి.. ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు.
No comments:
Post a Comment