Monday, 21 September 2015

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలు

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలు


తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్థంతి వేడుకలను సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటిలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు పొన్న . శంకర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ అలుపెరుగని పోరాటయోధుడని తెలంగాణ ఉద్యమంలో ఈయన  సేవలు మరువలేమని, 2012 సెప్టెంబర్‌ 21న పరమపదించిన కొండా లక్ష్మణ్‌ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై అనేక పోరాటాలు చేశారు. 1942-43 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని ,1949 సాయుధ పోరాటంలో తెలంగాణా కోసం పోరాడారని అన్నారు. 5 సార్లు యం.ఎల్.ఎ  గా చేసి మంత్రి పదవిని కూడా చేపట్టారని అన్నారు. తెలంగాణా ఉద్యమం లో మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకొన్న గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి యువజన సంఘం అద్యక్షుడు బోగే . ఉపేందర్, నాయకులు రాజేశ్వర్ ,మొగిలి,సత్యనారాయణ, వెంకట నారాయణ, సందీప్, సాయి , శివకుమార్ లు పాల్గొన్నారు

No comments:

Post a Comment