Sunday, 20 September 2015

ఒంటి కాలు ఫై వినూత్న నిరసన

ఒంటి కాలు ఫై వినూత్న నిరసన

 రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు నిరవధిక సమ్మె  ఆదివారానికి 19వ రోజుకు చేరిన తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని ఆశా కార్యకర్తలు ఒంటి కాలు ఫై వినూత్నరీతిలో నిరసన  తెలిపారు. సమ్మెలో భాగంగా  సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగు వందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించిన్నప్ప టికి  కనీస వేతనం పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆ సంఘం కార్యకర్తలు రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ, కవిత, చాయ,నిర్మల ,  స్వప్న, తిరుమల, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment