Thursday, 17 September 2015

వైభవంగా వినాయక చవితి వేడుకలు

శ్రీ బాలాజీ గణేష్ మండలి 
వినాయకచవితి ఉత్సవాలు రెబ్బెన మండల వ్యాప్తంగా వైభవంగా కొనసాగాయి.గ్రామాలలో వీధివీధిన గణనాథులను మంటపాలలో ప్రతిష్టించారు. వెరైటి గణనాథులు ప్రజలకు కనువిందు చేశాయి.భక్తి శ్రద్ధలతో వినాయకునికి దూపదీప నైవేద్యాలతో పూజలు చేశారు. బొజ్జగణపయ్యకు మారేడు దళాలు, మాచీ, బదరీ, చూత, తులసీ ,కరవీర తదితర పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి పూజించడంలో భక్తి ప్రపత్తులతో ఇష్టమైన వంటకాలను, ఫలాలను సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ రోడ్, దేవులగూడ, ఇంద్రానగర్, నక్కలగూడ, గంగాపూర్, గోలేటి లలో ప్రతిష్టించారు, రెబ్బెన గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి వినాయకున్ని చూసేం దుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.



No comments:

Post a Comment