Saturday, 5 September 2015

బొగ్గు లారీలో టేకు దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్



రెబ్బెన మండలంలోని గోలేటి శివారులోగల నాలుగు స్తంభాల కూడలిలో బొగ్గు లారీలో(ఏపి15టేఏ4751) అక్రమంగా తరలిస్తున్న 26 టేకు దుంగలను శనివారం రాత్రి 1.30 గంటలకు డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు తెలిపిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ వినయ్ కుమార్ కుమార్ సాహు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ టేకు దుంగల విలువ 62 వేలని లారీ డ్రైవర్,క్లీనర్ ను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశామని, కలపతో కూడిన బోగ్గు లారీని సీజ్‌ చేశామని పేర్కొన్నారు. కలప దొంగలపై నిఘా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో డీవైఆర్వో శ్రీనివాస్‌, బీట్‌ అధికారులు సతీష్, వెంకటస్వామి,రామయ్య, ఎండీ షరీఫ్‌, లత, రవి అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment