దేశ వ్యాప్త బందును విజయవంతం చేయండి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా విధానాలకు వ్యతిరేఖంగా రేపు సెప్టెంబర్ 2న తలపేట్టిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నారు.ఆయన మంగళవారం రెబ్బెన మండలంలోని గోలేటి సి పి ఐ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న విద్య వ్యతిరేఖ విధానాలను, కార్పోరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేఖంగా, విదేశీ యూనివర్శిటిలకు వ్యతిరేఖంగా ఈ బందును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కస్తూరి రవికుమార్, ఏ.అయ్.ఎస్.ఎఫ్ డివిజన్ అధ్యక్షులు గొగర్ల రాజేష్, ఏ,అయ్,ఎస్,ఎఫ్ మండల అధ్యక్షుడు పూదరి సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment