పత్తిపంట రైతన్నలను నిండ ముంచిన భారి వర్షాలు
అకాల వర్షానికి భారి పంట నష్టం,,సర్వే చేసిన అధికారులు
రెబ్బెన మండలలోని వంకులం గ్రామానికి చెందిన రైతులు రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి వంకులం శివారులో పత్తి పంట బాగా నష్ట పోయిందని రైతులు అందించిన వినతీ పత్రానికి శనివారం నాడు తహశిల్దార్ రమేష్ గౌడ్ ఆదేశాల మేరకు ఆర్ఐ అశోక్, వీఆర్వో వాసుదేవ్, ఎఈవో మార్క్ ఆధ్వర్యంలో రైతుల సమక్షంలో సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 119 మంది పట్టా రైతులకు సంబంధించిన 93 ఎకరాల పత్తి పంట నష్టపోయినట్టు సర్వేలో తేలిందని, సర్వే నివేదికను పైఅధికారులకు పంపిస్తామని త్వరలోనే నష్ట పరిహారం వచ్చేలా చూస్తామని అన్నారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంకులంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్న పత్తి పంట పూర్తిగా నేలరాలిందని దీంతో సుమారు 150 మంది పట్టా రైతులు అందరు రోడ్డున పడ్డారని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. ఈ సర్వేలోమాజీ సర్పంచ్ ప్రేమ్ దాస్, లోకండే పురుషోత్తం, రైతులు ఎలకర్ మనోహర్, ఎలాకర్ బాబాజి, లోనేరే ఇస్తారి, శ్యామరే శంకర్, సాలె భీమయ్య, పాలి ఒమాజి, గ్రామ రైతులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment