రెబ్బెనలోని ఆర్ అండ్ బీ అతిధి గృహంలో మండల అధ్యక్షుడు రాచకొండ రాజు అధ్యక్షతన బీజేపీ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ జేబీ పౌడేల్ మాట్లాడుతూ విష జ్వరాలు విజ్రుంభిస్తున్న కారణంగా మండలంలోని అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించాలని, రెబ్బెన మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని మండలంలో ఉన్న నిధుల దుర్వినియోగ అధికారులను అరికట్టాలని అన్నారు, ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణ కుమారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేసరి ఆంజనేయుల గౌడ్, జిల్లా కాంట్రాక్టర్ సెల్ కన్వీనర్ చక్రపాణి, సురేందర్, సంతోష్ శర్మ, బాలక్రిష్ణ, సతీష్ గౌడ్ నమిత డాలి, తాను బాయి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment