అకాల వర్షానికి పత్తి రైతుల ఆవేదన
రెండు రోజులుగా కురుస్తున్న భారి వర్షానికి పత్తి పంట బాగా నష్ట పోయిందని శుక్రవారం నాడు రెబ్బెన మండల వంకుల గ్రామానికి చెందిన రైతులు మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంకులంలోని రైతులు పూర్తిగా పత్తి పంటపై ఆధారపడి ఉన్నారన్నారు, రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా పెద్ద వాగు ఒడ్డున పువ్వు దశలో వున్నా 450 ఎకరాల పత్తి పంట పూర్తిగా నేలరాలిందని దీంతో సుమారు 50 మంది పట్టా రైతులు అందరు రోడ్డున పడ్డారని, కావున నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పించాలని వాపోయారు. ఈ కార్యాక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రేమ్ దాస్, రైతులు ఎలకర్ మనోహర్, బోర్కుటే నాగయ్య, ఎలాకర్ బాబాజి, లోనేరే ఇస్తారి, లోకండే పురుషోత్తం, శ్యామరే శంకర్, సాలె భీమయ్య, పాలి ఒమాజి, గ్రామ రైతులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment