Wednesday, 30 September 2015

శ్రీ సాయి గణేష్ మండలి

శ్రీ సాయి గణేష్ మండలి వద్ద ఎంఎల్ఎ కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు



మండల కేంద్రంలోని శ్రీ సాయి గణేష్ మండలి నినాయకునికి ఆసిఫాబాద్ ఎంఎల్ఎ కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణు వేద మంత్రాలతో కుమ్కుమారచనలు చేయించారు. అనంతరం తెరాస తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు  నవీన్ జైశ్వాల్ ఆధ్వర్యంలో తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ కు ఎమ్మెల్సి రావాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసంతర్పణ చేశారు. ఎంఎల్ఎ కోవ లక్ష్మి వచ్చిన భక్తులందరికీ అన్న సంతర్పణ   చేసింది. సాయంత్రం గణేష్ మండలి భక్తులు కీర్తనలు భజనలు చేశారు. ఎంపిపి కార్నాధం సంజీవ్, ఎమ్మార్వో రమేష్ గౌడ్, జడ్పిటిసీ అజ్మెర బాబురావు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment