Friday, 18 September 2015

 శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు


వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు. గురువారంనాడు వరంగల్ ఎమ్ జీఎమ్ ఆస్పత్రి కి శృతి, సాగర్ ల మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చినప్పటినుండి అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ హెచ్ ఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారం పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు అక్కడ తలితండ్రులు ఉండాలని ప్రజా సంఘాలు చేసిన డిమాండ్ ను పోలీసులు తిరస్కరించారు. పోస్ట్ మార్టంకు ముందు మృతదేహాన్ని చూడనివ్వాలన్న శృతి తల్లి తండ్రుల విజ్ఝప్తిని కూడా పోలీసులు తిరస్కరించారు. అక్కడికి వచ్చిన వందలాదిమందిని అక్కడినుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ప్రజా సంఘాల నాయకులు పట్టు విడువక పోవడంతో శ్రుతి మృతదేహాన్నిచూసేందుకు తల్లి రమాదేవి ని అనుమతించారు. ఆమె ఆస్పత్రి లోపలికి వెళ్ళి కొంత సేపటికి ఏడుస్తూ బైటికి వచ్చింది. విరసం నేత వరవరరావు దగ్గరికి వెళ్ళి తాను చూసింది చెప్పింది. ఆ తర్వాత వరవరరావు మీడియాతో మాట్లాడుతూ శృతిని అత్యాచారం చేసి చంపారని, శరీరంపై ఆసిడ్ పోసారని తల్లిగా తాను మీడియాకు చెప్పలేక తనతో చెప్పిందన్నారు.

No comments:

Post a Comment