Wednesday, 2 September 2015

రెబ్బెన లో సార్వత్రిక సమ్మె




  కేంద్ర ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాల ను అవలంభించడాన్ని నిరసిస్తూ నాయకులు బైటాయించారు,రెబ్బెన లోప్రధాన రహదారి మీద  ధర్నా చేశారు,  . ఈ ధర్నాలో  దిష్టిబొమ్మ దహనం చేశారు  ,సీ.ఐ.టీ.యి. జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించలేకపోయిందని, అందుకు
 సంబంధించిన చర్యలు కూడా చేపట్టలేదని విమర్శించారు. దీని వల్లే కార్మికులకు జీవన ప్రమాణాలు పూర్తిగా 
దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు చేయాల్సిన కనీస వేతనం పెంచలేక వారి శ్రమ దోపిడీ 
చేస్తుందని అన్నారు. కార్మిక సంఘాల నిర్ణయాల మేరకు ప్రతీ ఒక్క కార్మికునికి రూ. 15 వేలు వేతనం ఇవ్వాల్సి 
ఉన్నప్పటికీ  ప్రస్తుతం  అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం 
పెంచాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంభిస్తున్న కార్మిక వేతిరేక విధానాలపై సమ్మె నిర్వహించారు. బుధవారం   ప్రధాన వీధుల్లో ఏఐటీయూసీ, సీఐటీయూసీ ఆద్వర్యంలో సీ పీఎం, సీపీఐ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పలు యూనియన్ల కార్మికులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలని, కార్మిక వ్యతిరేక బిల్లులను ప్రవేశ పెట్టకూడదని కోరుతూ ఎర్ర జెండాలు చేతపట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ నాయకలు సీపిఐ నాయకులు నర్సయ్య,సత్యనారాయణ, గ్రామ  పంచాయితి  డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, సీపీఐ మండల కార్యదర్శి పొన్న శంకర్‌, ఏఐఎస్‌ఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీందర్‌ , మండల అధ్యక్షులు సాయికిరణ్‌, జిల్లా నాయకులు కస్తూరి రవికుమార్‌, విద్యార్థి యువజన సంఘాల ఆశ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు కార్మిక నాయకులు  పాల్గొన్నారు

No comments:

Post a Comment