
ఎలాంటి ఆహారమైనా ఆరోగ్యకరమే! అయితే కొన్ని పదార్థాల్ని కలిపి తినకూడదు. విడిగా తింటే ఆరోగ్యాన్నందించే కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యాన్ని హరిస్తాయి. కాబట్టి అలాంటి ప్రమాదకరమైన ఫుడ్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం.
సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత పండ్లు తింటూ ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే జీర్ణాశయంలోకి చేరుకునే పళ్లు తేలికగా అరిగిపోయి పేగుల్లోకి శోషణ చెందుతాయి. ఈ పళ్లకు మాంసం, ధాన్యాలు కలిస్తే అరుగుదల ఆలస్యమవుతుంది. ఆలోగా పళ్లు కుళ్లిపోవటం (ఫర్మెంటేషన్) మొదలవుతుంది. ఫలితంగా పేగుల లోపలి పొర దెబ్బతింటుంది.
మాంస ఉత్పత్తుల్లోని మాంసకృతులు, పిండి పదార్థాలతో కలిస్తే వాటిలోని మాక్రోన్యూట్రియెంట్స్ ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఈ రెండు పదార్థాల అరుగుదల కోసం ఉత్పత్తయ్యే జీర్ణరసాలు కలిసిపోవడం వల్ల కడుపులో గ్యాస్ పుడుతుంది. దాంతో కడుపు ఉబ్బరిస్తుంది.
దగ్గుమందు తీసుకుంటున్నప్పుడు నిమ్మరసం జోలికి వెళ్లకూడదు. నిమ్మరసం కొలెసా్ట్రల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ను విరిచేస్తుంది. దాంతో దగ్గు మందులోని డెక్స్‌ట్రోమిథార్పాన్ ప్రభావం రెట్టింపవుతుంది. ఫలితంగా తల తిరుగుడు, నిద్రలేమిలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.
టమాటల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో కలిపి తినటం ప్రమాదం. చిలకడ దుంపలు, బియ్యంలాంటి స్టార్చీ కార్బొహైడ్రేట్స్‌తో టమాటలు కలిపితింటే అజీర్తి సమస్య తలెత్తుతుంది. భోజనం తర్వాత అలసటగా అనిపిస్తుంది.
పెరుగు, పళ్లు
పాల ఉత్పత్తులు సైన్‌సలను మూసేస్తాయి. జలుబు, ఇతర అలర్జీలను పెంచుతాయి. ఈ ఉత్పత్తులను పళ్లతో కలిపి తింటే ఈ సమస్యలు రెట్టింపవుతాయి. కాబట్టి పెరుగును, పళ్లను విడివిడిగా తినాలి
No comments:
Post a Comment