ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును కాళేశ్వరం వద్ద కాకుండా తుమ్డిహెట్టి వద్ద నిర్మించాలని మాజీ మంత్రి, తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ అన్నారు. మంగళవారం నాడు పాదయాత్ర రెబ్బెనకు చేరుకుంది. తెదేపా నాయకులు రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు వినతీ పత్రం అందజేశారు. బోడ జనార్ధన్, రితేష్ రాథోడ్ మాట్లాడుతూ ఆసిఫాబాద్, రెబ్బెన మండలాలకు 23,500 ఎకరాల నీరు అందించే వట్టివాగు ప్రాజెక్టు కాలువలు చెడిపోయి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై చాలా సార్లు రైతులు విన్నవించుకోగా అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టును కాళేశ్వరం వద్ద నిర్మిస్తే దాని ద్వారా రైతులు తీవ్రంగా నష్ట పోవడము జరుగు తుంది. ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. రైతులను అస్సలు పట్టించుకోవడం లేదు. చివరి భూములు రైతులకు కూడా నీరందెల చూసి రైతులు ఆర్ధికంగా నష్టపోకుండా చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో జిల్లా తెదేపా మండల అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి. జిల్లా యువజన అధ్యక్షులు బావాడ తిరుపతి, మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, తెదేపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment