Wednesday, 9 September 2015

ప్రజాకవికి ఘన నివాళి

ప్రజాకవికి ఘన నివాళి


ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతిని రెబ్బెన మండలంలోని వంకులం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాటశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో వెంకటేశ్వర స్వామీ కాళోజీ స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాళోజి నారాయణ రావు ప్రజాకవిగా, ఉద్యమకారుడిగా, తెలంగాణా వాదిగా నిలబడ్డ మహా మనిషి అని కొనియాడారు. ఈ కార్యాక్రమంలో ప్రదానోపాధ్యాయురాలు జ్యోతి, పాటశాల యాజమాన్య కమిటీ చైర్మన్ చౌదరి తిరుపతి, వైస్ చైర్మన్ నాగుల సరోజన, పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment