వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం
సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆకనూరి కనకరాజు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలంలోని గోలేటి వన్ ఏ గని ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాల కార్మికులు హక్కులు కోల్పోయారని ఆరోపించారు. లాభాల బోనస్ గురించి అడిగే హక్కు జాతీయ సంఘాలకు లేదా అన్నారు. 2014-15 సంవత్సరానికి సింగరేణి కార్మికులకు 25శాతం లాభాల వాట సెప్టెంబర్‌లో ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణిలో క్యాడర్ స్కీం రెండు నెలల్లో అమలు చేస్తామని, లోకల్ రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. దీపావలి బోనస్ రూ. 75 వేలు ఇప్పిస్తామని, జాతీయ సంఘాలు తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, కోశాధికారి సారంగపాణి, ప్రతినిధి ఎల్లం గోవర్ధన్, శ్రీనివాసరావ్, సదాశివ్, మంగిలాల్, శంకర్, సత్యనారాయణ, సంపత్ కుమార స్వామి తదితరులున్నారు
No comments:
Post a Comment