నేడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావ్ పర్యటన
నేడు జిల్లా రాష్ట్ర ఇరిగేషన్ , మార్కెటింగ్ శాఖామంత్రి టి హరీష్ రావ్ రెబ్బెన మండలంలో పలు అభివృద్ది కార్యాక్రమాలకై పర్యటించనున్నారనీ తెలంగాణ జిల్ల ఉపాద్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ తెలిపారు అధికారులు, ప్రజాప్రతి నిధులు మండల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
వీరవనిత చాకలి ఐలమ్మ 30వ వర్థంతి,
తెలంగాణ రాష్ట సాయుధ పోరాటంలో వీరవనిత పేరుగాంచిన చాకలి ఐలమ్మ 30వ వర్థంతి వేడుకలు గురువారం రోజున స్థానిక అతిదిగృహం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజక సంఘ నాయకులు అద్యక్షు కార్యదర్శులు రామడుగు శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలకుల అండ దండలతో దొరలు సాగించిన దోపిడిలకు చాకలి ఐలమ్మ ఎదురోడ్డి నిలిచారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసి వీర వనితగా చరిత్రలోకి ఎక్కినా మహిళగా పేరుగాంచింది ఈ కార్యక్రమంలో తెలంగాణా వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మేడి వినోద్ కదతల సాయి ,సత్యనారాయణ కదతల తిరుపతి టి వి వి నాయకులు విజయ్ పవన్ రమేష్ హరికృష్ణ శాశిదర్ తదితరులు పాల్గున్నారు
No comments:
Post a Comment