Wednesday, 16 September 2015

తహశిల్దార్ కు ఎస్,ఎఫ్,ఐ వినతీ పత్రం

తహశిల్దార్ కు ఎస్,ఎఫ్,ఐ వినతీ పత్రం

ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయిందని రెబ్బెన మండల తహశిల్దార్ రమేష్ గౌడ్ కు బుధవారం నాడు పలు డిమాండ్లతో కూడిన వినతీ పత్రాన్ని ఎస్,ఎఫ్,ఐ ఆధ్వర్యం లో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్,ఎఫ్,ఐ జిల్లా సహాయ కార్యదర్శి గోదిసెల కార్తిక్, డివిజన్ ఉపాధ్యక్షులు బీ,వినోద్ మాట్లాడుతూ మండలంలో ఎస్సి,ఎస్టీ,బీసీ ప్రభుత్వ వసతీ గృహాల్లో కనీస వసతులు లేవని, కస్తూర్బా వసతీ గృహాలకు ప్రహరి గోడ లేక బాలికలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వ నియమ నిబంధల ప్రకారం పెట్టడం లేదని, సన్న బియ్యం పేరుకు మాత్రమే పెడుతున్నారని  అన్నారు.

No comments:

Post a Comment