పురాణం సతీష్ కు ఎమ్మెల్సి రావాలని అన్నసంతర్పణ
తెరాస తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఎమ్మెల్సి టికెట్టు రావాలని రెబ్బెనలోని శ్రీ బాలాజీ గణేష్ మండలి వద్ద తూర్పు జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు కొట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం భక్తి గీతాలు, కీర్తనలు పాడుతూ భజనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై సేఎచ్ హనూక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యాక్రమంలో జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ, టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, వార్డు సభ్యులు చిరంజీవి, ఎస్,వీ, పాటశాల కరస్పాండెంట్ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment