గత 30రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్రవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమ్మెలో మూతికి వస్త్రం కటుకుని నిరసన తెలేపారు.ఈ సందర్భంగా ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని 30 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు కనీస వేతనం 15వేలు ఇవ్వాలని, అలాగే ఆశావర్కర్లకు 2వ ఎఎన్‌ఎంలుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కరమయ్యేలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆశావర్కర్లు, మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment